రెమిడిసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న నలుగురు నిందితులను మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ పట్టుబడ్డారు. విజయవాడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే సాయిబాబు అనే వ్యక్తి ఆస్పత్రిలోని ఇంజక్షన్లను ఎవరికి అనుమానం రాకుండా తీసుకున్నారు. అదే ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేసే రుక్మిణికి ఒక్కొక్కటి పదివేలు చొప్పున ఐదు ఇంజక్షన్లను విక్రయించారు. మచిలీపట్నంలో ఒక్క రోగికి ఇంజక్షన్ అవసరమని తెలుసుకున్న గోపిరాజు ఒక్కొక్కటి రూ. 30వేల రూపాయలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాడు. ఇంజక్షన్లను మచిలీపట్నం తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బాధితుల అవసరాలను అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: తిరుపతి రుయా ఘటన: 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం