ETV Bharat / city

ఆపదలో ఆపన్న హస్తం - విజయవాడ రాజ్​ పురోహిత్‌ మిత్రబృందం అన్నదానం న్యూస్

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు మేమున్నామంటూ ముందుకొచ్చారు విజయవాడ రాజ్​ పురోహిత్‌ మిత్ర బృందం సభ్యలు. తినడానికి, ఉండటానికి ఏమీ లేక అవస్థలు పడుతున్న వారికి చేయూతనిచ్చి మానవత్వం చాటుకున్నారు. వారి ఆకలి బాధ తీర్చేందుకు 21 రోజుల పాటు అన్నదానం చేసేందుకు నడుం బిగించారు. అవకాశముంటే మరింత మందికి సహాయం చేస్తామని తెలిపారు.

వలస కార్మికులకు అన్నదానం చేస్తున్న రాజ్​ పురోహిత్‌ మిత్రబృందం

author img

By

Published : Mar 26, 2020, 7:58 PM IST

వలస కార్మికులకు అన్నదానం చేస్తున్న రాజ్​ పురోహిత్‌ మిత్రబృందం

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ కారణంగా వలస కార్మికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తినడానికి ఏమీ లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారి కోసం విజయవాడలో రాజ్​ పురోహిత్‌ మిత్ర బృందం 21 రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టి మానవత్వం చాటుకుంది. నగరంలోని పాతబస్తీ మార్కెట్‌లో సుమారు 300 మందికి పైగా వలస కార్మికులు పని చేస్తున్నారు. వారికి రోజుకు రెండు పూటలా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం సజావుగా జరిగేటట్లు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటూ పోలీసులు సంఘీభావం ప్రకటించారు. ఎటూ పోలేక రహదారులపై నివాసముంటున్న వలస కార్మికులు తినడానికి ఏమీ లేక పస్తులుంటున్నారని పాతబస్తీకి చెందిన రాజ్‌ పురోహిత్‌ మిత్ర బృందం ప్రతినిధి సురేష్‌ రాజ్‌ పురోహిత్‌ పేర్కొన్నారు. అలాంటి వారికోసం 21 రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారని, అవకాశం ఉన్నవారు ఆహారం దొరకని వారికి అన్నదానం చేసి మానవత్వం చాటుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

వలసదారుల ఆకలి తీర్చిన భాజపా నేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.