ETV Bharat / city

వాతావరణం : రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు

లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

rains falling in upcoming three days in andhrapradhesh
రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు
author img

By

Published : May 14, 2021, 7:01 PM IST

లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర - దక్షిణ ద్రోణి, ఆగ్నేయ మధ్యప్రదేశ్ మీదుగా ఉన్న ఆవర్తనం విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా వ్యాపించి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.

ఇదీచదవండి.: సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.