Punch prabhakar: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతోపాటు న్యాయ వ్యవస్థను అసభ్య, పరుష పదజాలంతో దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న పంచ్ ప్రభాకర్ దావోస్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం తాను దావోస్‌లో ఉన్నానని స్వామి కార్యంతోపాటు స్వకార్యం నెరవేరిందని ఈ నెల 23న ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దావోస్‌కు వచ్చా. ఏపీకి చెందిన కార్యదర్శులను కలిశా. నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఓ పెవిలియన్ పెట్టారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రతి రోజూ 5-6 గంటలపాటు వివరిస్తున్నారు. నేను నా వ్యాపార అవసరాలతోపాటు రాష్ట్రానికి చెందిన వారిని కలుద్దామని పెవిలియన్‌కు వెళ్లా. ఈ రోజు మే 23వ తేదీ. అన్ని విషయాల్లోనూ మంచే జరుగుతుంది. అందుకే జగన్‌ను కలవాలని ఆయన అభిమానులు చాలామంది వచ్చారు’ అని పంచ్ ప్రభాకర్ ఆ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
మరోవైపు వైకాపా లోక్‌సభాపక్ష నేత, ఎంపీ మిథున్‌రెడ్డిని పంచ్ ప్రభాకర్ దావోస్‌లో కలిసి తీసుకున్న చిత్రం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒకటి వైరలైంది. న్యాయమూర్తుల్ని కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించారంటూ పంచ్ ప్రభాకర్‌పై సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్టు చేయాలంటూ న్యాయస్థానం పలుమార్లు సీబీఐకి ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: