ETV Bharat / city

ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

సముద్ర జలాలపై ప్రయాణించే నౌకల సమాచార సేకరణ, నూతన సాంకేతికత పరిశోధనకు ఇస్రో పీఎస్​ఎల్​ఎల్వీని నింగిలోకి ప్రవేశపెట్టనుంది.

author img

By

Published : Mar 30, 2019, 7:46 AM IST

పీఎస్​ఎల్వీ-సీ 45
పీఎస్​ఎల్వీ ప్రయోగం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని షార్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 1న పీఎస్ఎల్వీ-సీ 45 వాహన నౌక.. డీఆర్​డీవోకి చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్​తోపాటు... విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇప్పటికే రాకెట్‌లో ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు... వ్యాబ్‌లో పీఎస్ఎల్వీ-సీ 45ను అనుసంధానం చేశారు. నేడు రాకెట్ సన్నద్దత, లాంచ్ అథరైజేషన్‌పై సమావేశం జరగనుంది. రేపు ఉదయం 5 గంటల 27 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామన్న శాస్త్రవేత్తలు... ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 9 గంటల 27 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ 45 నింగిలోకి దూసుకెళ్తుందని ప్రకటించారు. పీఎస్​ఎస్వీ-సీ 45 వాహన నౌక, ఉపగ్రహాలను 3వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశ పెట్టనుంది. సముద్ర జలాలపై ప్రయాణించే నౌకల సమాచారం సేకరణ, నూతన సాంకేతికత పరిశోధనకు ఈ ప్రయోగం దోహదపడనుంది.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.