కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు.
2016-19 మధ్య విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కాకుండా 2020-21 వారికి ముందు ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. 2016-19 మధ్య కారుణ్య నియామకం పొందవలసిన వాళ్లు 725 మందికిపైగా ఉన్నారని ఆందోళనకారులు చెబుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులతో కారుణ్య నియామక ఉద్యోగార్థులు వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి