విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ ఏర్పాటై ఏడాది పూర్తి కాగా.. ట్రాన్స్కో, జెన్కో, డిస్కాం, నెడ్కాప్, సోలార్ కార్పొరేషన్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థల డైరీని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.
విద్యుత్ రంగం అభివృద్ధితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆయా పంపిణీ సంస్థల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో రూ. 17,900 కోట్లు విడుదల చేసిందన్నారు. రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకుని.. లాభాల బాట పట్టించామని స్పష్టం చేశారు. ఏడు వేలకుపైగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: