ETV Bharat / city

Kirti Awards: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు - తెలుగు విశ్వవిద్యాలయం

Kirti Awards : తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.. 2018 సంవత్సరానికి గాను 44 మందికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. వీరికి జనవరిలో ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారం కింద రూ.5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు.

Kirti Awards
Kirti Awards
author img

By

Published : Dec 31, 2021, 11:40 AM IST

Kirti Awards : తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను 44 మందికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు, మహిళాభ్యుదయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిషం, నిరంతర విద్య తదితర రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలను గురువారం ప్రకటించింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసింది.

ఎంపికైన వారు..

డా.గంపా నాగేశ్వరరావు(వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్‌ (భాషాచ్ఛంద సాహిత్య విమర్శ), డా.మచ్చ హరిదాస్‌(సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్‌(కథ), తాటికొండల నరసింహారావు(నాటక రంగం), డా.బి.జానకి (జనరంజక విజ్ఞానం), ఎం.వి.రామిరెడ్డి (కాల్పనిక సాహిత్యం), ఎం.పవన్‌కుమార్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుక (పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్‌(జీవితచరిత్ర), జావేద్‌ (కార్టూనిస్టు), డా.ఆర్‌.కమల(ఉత్తమ రచయిత్రి), డా.పూస లక్ష్మీనారాయణ (వచన కవిత), కోడూరు పుల్లారెడ్డి (సృజనాత్మక సాహిత్యం), డా.ఎం.శ్రీకాంత్‌కుమార్‌(పరిశోధన), డా.గురవారెడ్డి (హాస్యరచన), సి.జానకీబాయి (ఉత్తమ నటి), వల్లూరి శ్రీహరి (ఉత్తమ నటుడు), రావుల పుల్లాచారి (ఉత్తమ నాటక రచయిత), షేక్‌ బాబు (హేతువాద ప్రచారం), డా.విజయలక్ష్మీ పండిట్‌ (ఉత్తమ రచయిత్రి), డా.టి.వి.భాస్కరాచార్య (వివిధ ప్రక్రియలు), పుల్లూరి ప్రభాకర్‌ (అవధానం), డా.సూరేపల్లి సుజాత (మహిళాభ్యుదయం), అడ్లూరి రవీంద్రాచారి (గ్రంథాలయకర్త), ఆచార్య దొర్తి ఐజాక్‌ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), జి.కిరణ్మయి(ఆంధ్రనాట్యం), గులాబీల మల్లారెడ్డి (నవల), గడ్డం శ్రీనివాస్‌ (జానపదకళలు), ఆచార్య మాడభూషి శ్రీధర్‌ (ఆధ్యాత్మిక సాహిత్యం), తిరువాయిపాటి చక్రపాణి (పద్యం), సంజయ్‌కిషోర్‌ (సాంస్కృతికసంస్థ నిర్వహణ), వొల్లాల వాణి (జానపద గాయకులు), డా.వాసరవేణి పరశురాములు(బాలసాహిత్యం), మ్యాజిక్‌ బోస్‌(ఇంద్రజాలం), డా.మోత్కూరి మాణిక్యరావు (పద్యరచన), దివాకర్ల సురేఖామూర్తి (లలిత సంగీతం), ఇందిరా కామేశ్వరరావు (శాస్త్రీయ సంగీతం), డా.సాగి కమలాకరశర్మ (జ్యోతిషం), ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య(గేయం), బి.సుధీర్‌రావు(కూచిపూడి నృత్యం), డా.బి.జయరాములు (ప్రాచీన సాహిత్యం), కృష్ణానాయక్‌చౌహాన్‌ (అనువాద సాహిత్యం), డా.పి.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం)లు కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి జనవరిలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారం కింద రూ.5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తారని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ చదవండి: Meeting on PRC: ఉద్యోగ సంఘాలతో చర్చలు.. పీఆర్సీపై వీడని ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.