దుర్గ గుడి ఈవో సురేష్ బాబుపై చర్యలు తీసుకోకుండా బదిలీ చేయడం దారుణమని... జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. సురేష్‌బాబు మంత్రి వెల్లంపల్లి బినామీ అని ఆరోపించారు. వెల్లంపల్లికి వ్యతిరేకంగా అనిశా ఎదుట అప్రూవర్‌గా మారతారనే భయంతోనే సస్పెండ్ చేయకుండా బదిలీ చేయించారని విమర్శించారు.
కింది స్థాయి ఉద్యోగులను వేల రూపాయలు లెక్కల్లో తేడాలుంటేనే సస్పెండ్ చేసిన దేవాదాయశాఖ... సురేష్‌బాబు కోట్లు దండుకున్నా వేటు వేయకుండా బదిలీ చేయడం వెనక కారణాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సురేష్‌బాబు హయాంలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్ష విధించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: