కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌లకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్‌కు బీసీ సంక్షేమశాఖను కేటాయించారు. అలాగే సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు అప్పగించారు. ఇక బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు, భవనాల శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ రహదారులు, భవనాల శాఖ బాధ్యతలు చూసిన ధర్మాన కృష్ణదాస్‌కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించిన సీఎం జగన్ ఆయనకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను అప్పగించారు.
ఇదీ చదవండి: మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్