ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో నిర్భందకాండ

రాజధాని అమరావతి గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రకాశం బ్యారేజీపై కవాతు నిర్వహించేందుకు వచ్చిన రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. తమను అరెస్టు చేస్తే బ్యారేజీలో దూకుతామని మహిళలు హెచ్చరించారు.

Police intercepting women on prakasam barrage
కవాతుకు పిలుపునిచ్చిన రాజధాని మహిళలను అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Mar 8, 2021, 7:43 AM IST

Updated : Mar 8, 2021, 11:46 AM IST

ప్రకాశం బ్యారేజీపై కవాతు నిర్వహించేందుకు వచ్చిన రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకుని.. వారిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తమ ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతి మహిళలు ప్రకాశం బ్యారేజీపై కవాతుకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెల్లవారుజామునుంచే రాజధాని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరిని రోడ్డుపైకి రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మందడంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. బ్యారేజీకిపైకి వెళ్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కవాతుకు పిలుపునిచ్చిన రాజధాని మహిళలను అడ్డుకున్న పోలీసులు

పోలీసుల అడ్డగింతపై మహిళా రైతుల నిరసన

రాజధాని కోసం ఉద్యమం చేపడుతున్న మహిళలు.. సీడ్ ఆక్సిస్ రోడ్డును దిగ్భందించారు. అనంతరం రాయపూడి నుంచి మందడం వరకు వస్తున్న మహిళలను పోలీసులు వెలగపూడి వద్ద అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్లకంచెలు వేసి రాకపోకలను నిలువరించారు. మందడం శివాలయం సెంటర్​లో.. మహిళలు రోడ్డుపై బైఠాయించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పురుగు మందు డబ్బాలు చేతబట్టుకున్నారు. అల్పాహారంలో పురుగుల మందు కలుపుకొని సామూహికంగా ప్రాణాలు వదిలేందుకు సిద్ధమన్నారు. స్పందించిన పోలీసులు.. మహిళల వద్ద నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నారు.

సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నం

ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఏడాదికి పైబడి నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జై అమరావతి.. సేవ్‌ అమరావతి అంటూ నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన మహిళల్ని విడుదల చేయాలని, అంత వరకూ వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.

ఇదీ చదవండి: 'ఆ పని చేయాలా... అనే గర్వం అంతకన్నా లేదు'

Last Updated : Mar 8, 2021, 11:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.