తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం భావిస్తోంది. దాడి విషయమై ఈనెల 19వ తేదీనే ఆ పార్టీ మంగళగిరి రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పార్టీ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమార స్వామి పేరుతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో సీఎం, సీఎంఓ అధికారులు, డీజీపీల పేర్లను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. దురుద్దేశ్యంతో ప్రణాళిక ప్రకారం సీఎం, డీజీపీలు దాడికి కుట్ర పన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా నేత దేవినేని అవినాశ్ ప్రొద్భలంతో పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని తెదేపా ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఫిర్యాదు చేసి 24 గంటలు పూర్తైనా..ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై తెదేపా నేతలు తప్పు పడుతున్నారు. సీఎం, సీఎంఓ, డీజీపీ పేర్లు ఉండబట్టే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేస్తున్నారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: