ETV Bharat / city

'ప్లాస్మా దానం చేయండి.. కరోనా బాధితులను కాపాడండి' - విజయవాడలో ప్లాస్మా దానం వార్తలు

రక్త దానం ప్రాణాల్ని నిలబెడితే .. కొవిడ్ వారియర్స్ ప్లాస్మా దానం కరోనా బాధితుల ప్రాణాల్ని కాపాడుతుందని వైద్యులు చెప్పారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు.

plasma donation
plasma donation
author img

By

Published : Sep 9, 2020, 7:26 PM IST

ప్లాస్మా దానం చేయండి.. కరోనా బాధితులను కాపాడండి

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన కోలుకున్న అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మాను దానం చేశారు. 2001లో రోడ్డు ప్రమాదానికి గురైన 12 ఏళ్ల పాపకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడగలిమన్నారు. ప్లాస్మా దానం చేసే వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

కరోనా వారియర్స్ వాలంటీర్​గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదనాంలాగే ప్లాస్మాను సైతం సులువుగా ఇవ్వవచ్చని అన్నారు. ప్లాస్మా దానం చేసినందుకు ప్రవీణ్ ప్రకాష్​కు జీజీహెచ్ సూపరింటెండ్ సర్టిఫికెట్​ను అందజేశారు. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలలలోపు ప్లాస్మా దానం చేయవచ్చని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్ డా.శివశంకర్ అన్నారు.

ఒక్కొక్కరి నుంచి 400 ఎంఎల్ ప్లాస్మాను సేకరిస్తామన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు అందిస్తామని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పటి వరకు 6 బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తే ఐదుగురు పూర్తిగా కోలుకున్నారని.. ఒకరు మరణించారని తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.