రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సాహ్ని నియామకంపై విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు కాంతారావు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. నేడు తుది వాదనలు వినిపించారు.
ప్రభుత్వంతో సంబంధం లేకుండా, నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
ఇదీ చదవండి: