No permission for rythu garjana sabha: విజయవాడ ధర్నాచౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి రైతు గర్జన సభకు.. పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రైతు సంఘాల నిర్వాహకులు.. వేదికను దాసరి భవనంలోకి మార్చారు. సభకు రాకుండా.. రెండ్రోజులుగా పలు జిల్లాల్లో రైతు నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులను.. పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బందాలు చేశారు. రైతు నేతల అరెస్టులను.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు.
విజయవాడకు చేరుకున్న జాతీయ రైతు సంఘ బృందం
జాతీయ రైతు సంఘ నాయకులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఏఐకేఎస్(AIKS) ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, సంయుక్త కార్యదర్శి విజూకృష్ణన్ సహా ఏడుగురు సభ్యుల బృందం విజయవాడ చేరుకున్నారు. వీరికి.. ఏపీ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ, సహా పలువురు నేతలు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇవాళ విజయవాడ దాసరి భవన్ లో జరిగే రైతు గర్జన సభలో.. జాతీయ రైతు సంఘ బృందం పాల్గొననుంది.
ఇదీ చదవండి:
TDP Leaders House Arrest: నాటుసారాపై నిరసనలకు తెదేపా పిలుపు.. ముందస్తుగా పలువురు గృహ నిర్భందం