విజయవాడ నగర శివారులో సనత్ నగర్ నుంచి కానూరు మీదుగా తాడిగడప వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి 1996లోనే 'వుడా' ప్రణాళిక రూపొందించింది. పాతికేళ్లు దాటుతున్నా ఈ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. రాష్ట్రంలోనే మేజర్ పంచాయతీగా పేరున్న కానూరు.. ఇప్పుడు తాడిగడప మున్సిపాలిటీగా(Tadigadapa municipality at vijayawada) మారింది. ఇక్కడ జనసాంద్రత పెరిగింది. అందుకు తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలు మాత్రం అభివృద్ధి చెందలేదు. 80 అడుగుల రోడ్డును నిర్మిస్తే కానూరు చుట్టుపక్కల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలకు రవాణా సౌకర్యం లభిస్తుంది. పంట కాలువ, బందరు రోడ్డుమీద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అలాగే చుట్టుపక్కల అనేక కాలనీలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు అంటున్నారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణం కోసం పోరాటం సాగించేందుకు కానూరు వాసులు '80 అడుగుల రోడ్డు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్' (road residents welfare association)ఏర్పాటుచేశారు. రోడ్డు నిర్మాణానికి ఎక్కడా స్థల సేకరణ సమస్య లేదని గుర్తుచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు కోసం సర్వే చేసి మార్జిన్ కూడా వేశారని, స్థల యజమానులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు వివరాలు సిద్ధం చేశారని అంటున్నారు.
పంట కాలువ నుంచి ఇంజినీరింగ్ కళాశాల మీదుగా 100 అడుగుల రోడ్డుకు అనుసంధానం చేసేలా బందరు రోడ్డుకు సమాంతరంగా మరో రహదారిని ఇప్పటికే నిర్మించారు. అయితే ఇంజినీరింగ్ కళాశాల వద్ద వంతెన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. రోడ్డు పనులు మధ్యలో ఆపేయడంతో అక్కడ నిర్మించిన వంతెన నిష్ప్రయోజనంగా మారింది. ఈ రహదారిని త్వరగా పూర్తి చేయాలంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో స్థానికులు ప్రదర్శన చేశారు. ఎవరు రోడ్డు వేయిస్తారో వారికే తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇవీచదవండి.