Fuel price hike: పెరిగిన ఇంధన ధరలు.. విలవిల్లాడుతున్న ప్రజలు..! - ఏపీ వార్తలు
Fuel price hike: భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఐదు రోజుల్లో నాలుగోసారి చమురు సంస్థలు ధరలను పెంచాయి. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరకుల ధరలనే భరించలేకపోతున్న సామాన్యుల మీద చమురు ధరలు పెరగుదల మరో భారంగా మారింది. దాంతో దాదాపు నాలుగు నెలల అనంతరం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ 113 రూపాయలు దాటగా.. డీజిల్ 99 రూపాయలు దాటేసింది. ఈ ధరల పెరుగుదలపై వాహనదారులతో "ఈటీవీ భారత్" ప్రతినిధి ముఖాముఖి.