విజయవాడ నగర వాసులు ఇండోర్ స్టేడియంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరారు. చాలాసేపటి వరకు అధికారులు పరీక్షలు చేయని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పరీక్షలు చేస్తారో లేదో అన్న సమాచారం ఇవ్వలేదని బాధితులు అసహనం వ్యక్తం చేశారు.
నిన్న పరీక్ష చేయించుకోవడానికి వెళ్తే.. సమయం అయిపోయిందని ఈరోజు మళ్లీ రావాలని అధికారులు తెలిపారని నగరవాసులు చెబుతున్నారు. నేటి ఉదయం నుంచి క్యూలో నిల్చున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: