అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రహదారుల మరమ్మతు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు మరమ్మతు పనులతో పాటు అనంతపురం జిల్లా కొత్తచెరువు రోడ్డు పనుల్లో ఆయన పాల్గొననున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించారు.
బుధవారం విజయవాడకు పవన్..
ఈనెల 29న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ సమావేశం నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం విజయవాడ రానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి
YCP Vs Janasena: వైకాపా Vs జనసేన.. సినిమా టిక్కెట్ల వివాదంపై మాటల తుటాలు