తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవని... చిన్నప్పటి నుంచి అలవాటు లేదని పవన్ అన్నారు. జనసైనికులు, అభిమానులు, వీర మహిళలు సేవా వారోత్సవాలు జరుపుతున్నారని... తొలి రోజున రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్ కిట్లు అందజేశారని... అలాగే చాలాచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారని మీడియా విభాగం వివరించింది. సేవా వారోత్సవాలు చేసిన అందరికీ పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు!