పల్నాడు ప్రాంతంలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు హత్యకు గురైతే.. నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
పల్నాడులో మారణహోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న నారా లోకేశ్‌ను అడ్డుకుంటారా ? అని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లకుండా అర్థం లేని కారణాలను సాకుగా చెప్పి నోటీసులివ్వటం దారుణమన్నారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని..,సామాజిక ద్రోహమని పంచుమర్తి దుయ్యబట్టారు.
ఇవీ చూడండి :