ETV Bharat / city

'ఉపాధి హామీ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

author img

By

Published : Oct 2, 2020, 3:17 PM IST

ఉపాధి హామీ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పంపినా.. .రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. తక్షణమే నిధులు విడుదల చేయకుంటే న్యాయపోరాటంతోపాటు ప్రత్యేక ఉద్యమం చేపడతామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఉపాధి హామీ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఉపాధి హామీ పనుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ...పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండేళ్లుగా బిల్లులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వానికి మంచిబుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ బకాయియి 2,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా... ఇప్పటివరకు చెల్లించలేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పంపినా...రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే నిధులు విడుదల చేయకుంటే న్యాయపోరాటంతో పాటు ప్రత్యేక ఉద్యమం చేపడతామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఇదీచదవండి

సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.