విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని కొవిడ్ పరీక్షా కేంద్రం వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని వారు నిరసన చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు విధుల నుంచి తొలగించారని ఉద్యోగులు ఆరోపించారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకుని పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'బిల్లు చెల్లించకపోతే మృతదేహాన్ని మున్సిపాలిటీ వాళ్లకు అప్పగిస్తాం'