ETV Bharat / city

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభం

author img

By

Published : Apr 11, 2020, 7:11 AM IST

ప్రభుత్వ, ప్రైవేట్​ ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలను కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆసుపత్రుల్లో ప్రత్యేక ప్రవేశమార్గాన్ని అనుసరించాలని... వైద్యులు వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఎన్‌95 మాస్కులను ధరించాలని తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభం
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభం

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో గత కొద్దిరోజుల నుంచి సేవలు స్తంభించినందున రోగులు అవస్థలు పడుతున్నారు. సాధారణ దగ్గు, జ్వరంతో బాధపడే వారిని చూసే వైద్యులు కరవయ్యారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆసుపత్రుల్లో ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని అనుసరించాలని సూచించింది. వైద్యులు వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఎన్‌95 మాస్కులను ధరించాలని తెలిపింది. ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాటిలో ఉన్న ఆరోగ్య సిబ్బంది పట్టణాలు, నగరాల్లోని ముఖ్యమైన కూడళ్లలో కనీస అవసరాలైన మందులతో కొద్దిసేపు ఉంటున్నారు. వీరు ఉంటున్న సమాచారాన్ని మైకుల ద్వారా స్థానికులకు తెలియజేస్తున్నారు.

ఇదీ చూడండి: కడప రిమ్స్​లో ఓపీ సేవలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.