ఆన్లైన్ వేదికగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. విశాఖలోని ఓ హోటల్‌కు బాలికను తీసుకొచ్చిన వ్యభిచార ముఠా నిర్వాహకుడికి సంబంధించి... పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం అతడ్ని పట్టుకునేందుకు వెళ్లిన సీఐడీ కానిస్టేబుల్‌ను నిందితుడు కారుతో ఢీ కొట్టి పారిపోయాడు.
పోలీసులు వెంబడించి అతడితో పాటు ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ హోటల్ యజమాని, అందులో పనిచేసే ఓ వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడ దాడి చేసి ఓ విటుడితో పాటు మహిళను అరెస్ట్ చేశారు. తిరుపతిలోనూ ఓ హోటల్లో దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: