పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల శిక్షణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు సిద్ధమయ్యేలా ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రోజూ పాఠ్యాంశాల బోధన చేయనున్నారు. డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విద్యార్థులు ఫోన్ ద్వారా నిపుణులతో సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
ఇవీ చదవండి...'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి!