రైతుబజార్లలో రాయితీ ధరలకు ఉల్లి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. మహారాష్ట్రలో వర్షాల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా దెబ్బతిని..అక్కడినుంచి ఏపీకి వచ్చే సరకు తగ్గటంతో ధరలు పెరిగాయని వివరించారు. నాఫెడ్ ద్వారా వెయ్యి టన్నుల ఉల్లిని సమీకరించి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఉల్లిని వినియోగదారులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు...వినియోగదారులకు తప్పని కన్నీళ్లు