ETV Bharat / city

సత్తా చాటుతున్న ఒంగోలు గిత్తలు.. విజయవాడలో ఉత్సహంగా బల ప్రదర్శన

author img

By

Published : Jan 11, 2021, 12:58 PM IST

సంక్రాంతి రాకమునుపే.. తెలుగునేలపై ఒంగోలు వృషభాల జోరు మొదలైంది. తెలుగు రైతుకు ఆత్మ బంధువుగా.. తెలుగుజాతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత.. ఒంగోలు ఎడ్లదే. అలాంటి జాతి ఆవులు, ఎడ్ల పోటీలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈసారి ఒంగోలు జాతి వృషభాల విశిష్టతను తెలిపేలా విజయవాడలో.. ఎండ్ల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో గోవుల పట్ల ఆరాధనా భావాన్ని పెరిగేలా.. ప్రత్యేక పూజలూ చేస్తున్నారు.

Ongole_Bulls_Competition
ఉత్సాహంగా ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు
ఉత్సాహంగా ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు

విజయవాడ కానూరు సిద్దార్ధ కళాశాల మైదానంలో.. ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆకర్షణీయమైన రూపం, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన ఒంగోలు పశువులు.. ఆర్యుల కాలం నుంచే ఉన్నాయి. ఇతర జాతులతో పోలిస్తే వీటికి శారీరక సామర్థ్యం ఎక్కువ ఉండటం వల్ల.. ప్రతికూల వాతావరణాన్నీ తట్టుకోగలవు. యజమానుల పట్ల విధేయత, విశ్వాసం చూపడంలో వీటికవే సాటి..! అలాంటి ఒంగోలు జాతి ఎడ్లు, ఆవుల సంతతి అభివృద్ధి.. క్రమంగా క్షీణిస్తోంది. పోషణ భారమై.. అరుదైపోతున్న ఈ జాతి పరిరక్షణకు.. ఈ తరహా పోటీలు ఎంతో ఉపకరిస్తున్నాయి.

పశుపోషకుల్లో ఉత్సాహాం నింపేందుకు..

ఒంగోలు పశువుల పోటీల ద్వారా పశుపోషకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు.. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావు నేతృత్వంలో.. గత కొన్నేళ్లుగా ఏటా ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు వందకుపైగా ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొని.. నువ్వా- నేనా అన్నట్లుగా తలపడతాయి. గో సంరక్షణలో భాగంగా.. నేడు జరగబోయే గోపూజకు.. కర్ణాటకలోని ఆదిచుంచునగిరి మఠాధిపతి స్వామి నిర్మలానంద హాజరుకానున్నారు.

ఒంగోలు జాతికి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్‌..

ఒంగోలు జాతి పశువులను.. కొంతమంది రైతులు సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అయితే... ఈ జాతికి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్‌లో వీటి మనుగడే ప్రశ్నార్థకమైందని పశు ప్రేమికులు నిరాశ చెందుతున్నారు.

యంత్రాల రాకతో.. పశువులకు తగ్గిన ఆదరణ..

సాగులో యంత్రాల రాకతో.. పశువుల అవసరం క్రమంగా తగ్గి.. ఆదరణ కరవైంది. అయినా.. ఇప్పటికీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల వారు ఒంగోలు జాతి పశువులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఇవీ చూడండి:

సంబరాల సంక్రాంతికి.. సొంతూళ్లకు జనాల పయనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.