విజయవాడ నగర శివారు కుందా వారి కండ్రికలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో దోపిడీ చేయడమే కాకుండా అడ్డువచ్చిన వృద్దురాలిని దారుణంగా హత్య చేశారు. ఇంటి ముందు కూర్చొని ఉన్న వృద్దురాలి సుబ్బమ్మపై ఆగంతకులు దాడి చేసి.. నగలు దోచుకెళ్లారు. తీవ్రగాయల పాలైన సుబ్బమ్మను ప్రైవేట్ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. సీసీఎస్, నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: crime news: కుమార్తె వివాహం జరుగుతుండగా ఎవరికీ చెప్పకుండా వెళ్లి తల్లిదండ్రులు.. ఆ తర్వాత..