ETV Bharat / city

పొంచి ఉన్న 'నివర్' తుపాను...అప్రమత్తమైన అధికారులు - నిపర్ తుపాన్ తాజా వార్తలు

బంగాళాఖాతంలో నివర్ తుపాను ఏర్పడనుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపే అవకాశమున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ మేరకు వ్యవసాయశాఖతో పాటు వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

పొంచిఉన్న 'నివర్' తుపాను
పొంచిఉన్న 'నివర్' తుపాను
author img

By

Published : Nov 23, 2020, 6:02 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడనున్న నివర్ తుపాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం...అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట సహా..మినుము, పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున త్వరితగతిన కోతల్ని ప్రారంభించేలా చూడాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ప్రభుత్వం సూచించింది. పంట కోతల్ని వీలైనంత త్వరగా చేపట్టాల్సిందిగా రైతులకు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు వైద్య బృందాలను కూడా సిద్ధం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంబులెన్సులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచనలిచ్చారు.

తుపాను కారణంగా కోస్తాంధ్రలోని నెల్లూరు, రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటినుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీచదవండి

బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం...రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.