ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యూహాత్మక వైఖరే.. హైదరాబాదు సంస్ధానం, ఒడిశాలోని 26 రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేయడానికి దోహదపడిందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ధృఢ సంకల్పంతోనే 556 సంస్థానాలను భారతదేశంతో ఐక్యం చేసుకోగలిగామని కొనియాడారు. సంస్ధానాల విలీన ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు వచ్చినా పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి అఖండ భారత నిర్మాణానికి మూల స్ధంభంగా నిలిచారన్నారు.
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశానికి అందించిన సేవలు మరువరానివని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్వస్థలంలో ఎత్తైన సర్దార్ విగ్రహాన్ని నెలకొల్పారని, ఇప్పడు అది ఆ మహానేత గౌరవ చిహ్నంగా విరాజిల్లుతోందని అన్నారు.
ఇదీ చదవండి: 'అఖండ భారతావనిని ఏకం చేసిన అపర చాణక్యుడు'