National BC commission: రాజధాని రైతుల మహా పాదయత్రకు సంఘీబావం తెలిపిన తమపై అక్రమ కేసులు బనాయించారని రాష్ట్ర నాయీ బ్రాహ్మణసేవా సంఘం ఎస్పీకి చేసిన ఫిర్యాదుపై జాతీయ బీసీ సంఘం స్పందించింది. 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు నెల్లూరు ఎస్పీకి లేఖ రాసింది.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన నాయీ బ్రాహ్మణ సంఘం..
Complaint to Nellore SP: కావలిలో అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉన్న దేవుడి ప్రచార రథాల ముందు సన్నాయి మేళం వాయిస్తుంటే.. డీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు తమను అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేశారని నాయూ బ్రాహ్మణ సంఘం నేతలు ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమను ఆవహేళన చేస్తూ తమ కులవృత్తిని అవమానించేలా పోలీసులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. తమపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: