Lokesh Letter: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్థాంతరంగా ఇంటికొచ్చిన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. కొందరు విద్యార్థులకు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం అయ్యాయని, వర్సిటీల నుంచి సమాచారం లేక కొందరు అయోమయంలో ఉన్నారని లోకేశ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జగన్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో లోకేశ్ కోరారు.

ఇదీ చదవండి:
60 ఏళ్లు దాటిన వాళ్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ: మంత్రి పేర్నినాని