ETV Bharat / city

పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి: ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ - పది పరీక్షల రద్దుపై సీఎం జగన్​కు లోకేశ్ లేఖ వార్తలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులకు ఉత్తీర్ణత కల్పించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా తెలంగాణ సహా దేశంలో మరో 12 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దుచేశాయని గుర్తు చేశారు.

పదో తరగతి  పరీక్షలు రద్దు చేయండి: ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ

author img

By

Published : May 13, 2021, 4:36 PM IST

కొవిడ్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నందున పదో తరగతి విద్యార్థులను పాస్ చేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​కు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు.

'గత ఏడాది రాష్ట్రంలో 5 వేల కరోనా కేసులు ఉన్నప్పుడే 10 పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయకుండా రద్దు చేయండి. హైకోర్టు ఆదేశాలు, ప్రతిపక్ష నాయకుల ఆందోళనలకు తావివ్వకుండా మానవత్వంతో వ్యవహరించి రద్దు నిర్ణయం ప్రకటించండి.' అని కోరారు.

పలు మార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో తాను నిర్వహించిన ఆన్​లైన్ సమావేశాల్లో కొవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో అర్థమైందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితుల్ని మన భవిష్యత్తు తరం చూడాల్సి వస్తోంది.. అని లేఖలో లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.