అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ని వేధిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కూన భార్య ప్రమీలను ఫోన్లో లోకేశ్ పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతున్నందుకే కూనపై అధికార పార్టీ కక్ష కట్టిందని లోకేశ్ విమర్శించారు. తెదేపా నాయకుల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా జగన్ రెడ్డి కక్ష తీరట్లేదని దుయ్యబట్టారు.
అక్రమాలు, న్యాయం కోసం, ప్రజల కోసం తన భర్త పోరాటం కొనసాగిస్తారని.. కేసులకు భయపడేది లేదని ప్రమీల అన్నారు.
ఇదీ చదవండి: