MP Raghu ramaKrishna raju on AP Govt: ఏపీలో జగన్ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం పెద్దగా తగ్గలేదని.. మహా అంటే మూడు వేల కోట్లు తగ్గి ఉంటుంది.. అంత మాత్రాన ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎందుకు దోబూచులాడుతోందని ప్రశ్నించారు. గుత్తేదారులకు సైతం బిల్లులు చెల్లింకపోవడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమకు జగన్ ఏమి చేశారో చెప్పాలి..
రాయలసీమలోని కుందూనదిపై ప్రాజెక్టులు.. పోలవరం ప్రోజెక్టు మాదిరినే నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. శంకుస్థాపనలు మినహాయిస్తే.. రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలు అమాయకులు కారని.. అన్నింటిని గమనిస్తున్నారని అన్నారు.
ఏపీలో భగవాన్ సత్యసాయి బాబా.. 600 గ్రామాలకు మంచినీరు అందిచే పథకాన్నిఏర్పాటు చేస్తే.. దానిలో పని చేసే ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
వాళ్లకు కొట్టే అధికారం ఎవరిచ్చారు
పత్రికా రంగాన్ని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని రఘురామ హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసు దాడులు మితిమీరుతున్నాయని.. నిందితులను ఇష్టానుసారంగా కొడుతున్నారని ద్వజమెత్తారు. నిందితులను కొట్టే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి..
AP Employees Unions: పీఆర్సీ ప్రకటన.. ఉద్యోగ సంఘాల నేతలు ఏమన్నారంటే..