విజయవాడ ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) తెదేపా(tdp)ను వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని.. ఆయన వర్గీయులు ఖండించారు. కేశినేని భవన్(kesineni bhavan)లో ఒకచోట రతన్ టాటా(ratan tata)తో ఎంపీ కలిసి ఉన్న ఫొటో ఏర్పాటు చేస్తే.. దానిని తప్పుపట్టడం సరికాదన్నారు. టాటా ట్రస్ట్ సేవల గుర్తింపులో భాగంగానే.. కేశినేని భవన్లో ఓ ఫొటో ఏర్పాటు చేసినట్లు.. రతన్ టాటా ట్రస్ట్‌తో కలిసి చేసే సేవలు కేశినేని నాని మరింత విస్తరిస్తున్నట్లు వారు వివరించారు.
కార్యాలయంలో మిగిలిన చోట్ల తెదేపా నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని.. పార్లమెంట్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకే నాని దిల్లీ వెళ్లినట్లు ఆయన వర్గీయులు స్పష్టతనిచ్చారు.
ఇదీ చదవండి:
TDP leaders : 'విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై.. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'