ETV Bharat / city

కొవాగ్జిన్​ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి - తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్​

హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి భారత్​ బయోటెక్​కు చెందిన కొవిడ్​ టీకా కొవాగ్జిన్​ను తీసుకున్నారు. అరవై ఏళ్లు పైబడిన, 45 సంవత్సరాలు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్షణమే వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

mos fot home kishan reddy have taken covaxin in hyderabad gandhi hospital
కొవాగ్జిన్​ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి
author img

By

Published : Mar 2, 2021, 11:32 AM IST

కొవాగ్జిన్​ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి

దేశ వ్యాప్తంగా పదివేల ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు చేశామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. నిన్న కొన్ని కేంద్రాల్లో టీకా పంపిణీ జరిగిందని.. నేటి నుంచి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇరవై వేల కేంద్రాల్లో వ్యాక్సిన్​ పంపిణీ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో భారత్​ బయోటెక్​కు చెందిన కొవాగ్జిన్​ టీకా తొలి డోసును కిషన్​రెడ్డి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

తెలంగాణలోనూ 45 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91 ఉచిత కొవిడ్​ వాక్సినేషన్​ ప్రారంభించినట్లు తెలిపారు. 46 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అరవై ఏళ్లు పైబడిన, 45 సంవత్సరాలు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్షణమే వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్​ తర్వాత కొవిడ్​ నియంత్రణ చర్యలను పాటించాలని సూచించారు.

సోమవారం రాష్ట్ర వైద్యోరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ టీకా తీసుకున్నారని.. ఇవాళ తాను కొవాగ్జిన్​ టీకాను వేసుకున్నట్లు తెలిపారు. కొవిడ్​ వ్యాక్సినేషన్​ పట్ల ఎవరూ అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్​ కేసు బయటపడి నేటికి ఏడాది గడిచిందని.. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరంతరంగా సేవలందించారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, సికింద్రాబాద్​ ప్రజల తరఫున.. వైద్యులు, సిబ్బందికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

ఉభయతారకంగా నదుల అనుసంధానం: సీఎం జగన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.