నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెస్ పాలసీకి విరుద్ధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సెలవు రోజైన ఆగస్టు 15న ప్రభుత్వం జీవోల ఆఫ్‌లైన్‌కు సంబంధించి ఉత్తర్వులివ్వటం పాలకుల దిగజారుడుతనానికి సంకేతమన్నారు. ప్రతిపక్షనేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కోర్టులకు వెళ్లి బెయిలు తెచ్చుకుంటున్నారని..ఎఫ్ఐఆర్ ప్రతులను కూడా అందుబాటులో లేకుండా చేస్తారా ? అని దుయ్యబట్టారు.
ప్రజలకు సమాచారం తెలియకుండా చేసే అధికారం, హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని అశోక్ బాబు ప్రశ్నించారు. రహస్య, బ్లాంక్ జీవోల వ్యవహారంపై తెదేపా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 2008లో రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన జీవోల ఆన్లైన్ విధానాన్ని, ఇప్పుడు జగన్ ఆఫ్‌లైన్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ పాలన తీరుతెన్నులు ప్రజలకు తెలుస్తున్నాయనే ఈ పనిచేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవోలను తిరిగి ఆన్లైన్లో పెట్టేవరకు తెదేపా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ జీవోలపై మరో అంతర్గత నోట్