MLC Ashok Babu On Jagananna thodu scheme: 'జగనన్న తోడు' పథకం కింద ముఖ్యమంత్రి జగన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)కై బటన్ నొక్కలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కి చేస్తున్నది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాదని.. డూప్లికేట్ అండ్ బోగస్ ట్రాన్స్ఫర్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.16 కోట్లలో రూ.10 కోట్లు కేంద్రప్రభుత్వానిదైతే.. రూ. 6 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిదని వెల్లడించారు. చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వనిధి ఫథకానికి జగనన్న తోడు స్టిక్కర్ వేస్తున్నారని విమర్శించారు.
Ashok Babu on YSRCP: చిరు వ్యాపారులకు రూ. 10 వేలు ఆత్మనిర్బర నిది ద్వారా వడ్డీలేని రుణాలను కేంద్రం ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం లబ్ధిదారులను ఎంపిక చేసే పని మాత్రమే చేస్తోందని.. నిధులు కేంద్రం విడుదల చేస్తోందని వెల్లడించారు. జగనన్న తోడులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు రూ. 6 కోట్లు అయితే పబ్లిసిటీ ఖర్చు రూ. 10 కోట్లని అశోక్ బాబు దుయ్యబట్టారు.
ఇవీ చూడండి