ETV Bharat / city

'ఉచిత విద్యుత్​పై అవగాహన కల్పించండి' - YSR free agricultural electricity scheme news

వైఎస్సార్ ఉచిత వ్యవ‌సాయ విద్యుత్ ప‌థ‌కం పోస్టర్‌ను దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అవిష్కరించారు. ఈ పథకం గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

minister-vellampalli-inaugurate-ysr-vuchitha-vyavasaya-vidhyuth-pathakam-poster
వైఎస్సార్ ఉచిత వ్యవ‌సాయ విద్యుత్ ప‌థ‌కం పోస్టర్ విడుదల
author img

By

Published : Nov 4, 2020, 2:02 PM IST

రైతులకు అత్యంత ప్రయోజనకరమైన వైఎస్సార్ ఉచిత వ్యవ‌సాయ విద్యుత్ పథకంపై రైతులందరికీ సమగ్ర అవగాహన కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారుల‌కు సూచించారు. అనంత‌రం వైఎస్సార్ ఉచిత వ్యవ‌సాయ విద్యుత్ ప‌థ‌కం పోస్టర్ మంత్రి అవిష్కరించారు.

రాష్ట్రంలో దాదాపు 11ల‌క్షల మంది, కృష్ణాజిల్లాలో ల‌క్ష 10వేల మంది రైతులు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకం ద్వారా లబ్ది పొందనున్నారని మంత్రి తెలిపారు. వీరందరికీ కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్కరణల్లో భాగంగా... అవగాహన కల్పించేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వం నుంచి ఎంత సహాయం అందుతున్నదీ, విద్యుత్ కంపెనీ నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా, సేవలు అడిగే హక్కు రైతుకు వస్తుందన్నారు.

జిల్లా స్థాయి నుంచి డివిజన్, మండల, గ్రామ స్థాయిలో రైతు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. త‌్వరలో 5 కోట్ల రూపాయ‌ల‌తో ఇన్‌డోర్ స‌బ్ స్టేష‌న్ నిర్మాణం ప‌నులు ప్రారంభించాల‌ని అధికారులకు మంత్రి సూచించారు. దుర్గామలేశ్వర‌స్వామి దేవ‌స్థానం ప్రాంగ‌ణంలో నిర్మించ‌నున్న ఇన్‌డోర్ స‌బ్ స్టేష‌న్ ద్వారా అమ్మవారి దేవాలయానికి నాణ్యమైన విద్యుత్​ అతి త‌క్కువ ధ‌ర‌కు అందుతుంద‌న్నారు.. ఇన్‌డోర్ స‌బ్ స్టేష‌న్ ప్రారంభ‌మై 5 నెల‌ల త‌రువాత నుంచి నియెజ‌క‌వ‌ర్గంలో చాలా ప్రాంతాల‌కు నాణ్యమైన‌ విద్యుత్ అందుతుంద‌న్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ చైర్మ‌న్ ప‌ద్మజ‌నార్థన రెడ్డి, డీఈ సుధాక‌ర్‌, ఏఈ బాలాజీ, ఈఈ ఛాంబ‌ర్ అప్ కామ‌ర్స్ అధ్యక్షులు కొన‌క‌ళ్లు విద్యాధ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏలూరులో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.