ETV Bharat / city

క్షీర విప్లవం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది: మంత్రి అప్పలరాజు - మంత్రి సీదిరి అప్పలరాజు

క్షీర విప్లవానికి ముందడుగు వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాల సేకరణ 20 శాతం మాత్రమే వ్యవస్థీకృతంగా ఉందని.. అమూల్​తో ఒప్పందం ద్వారా వ్యవస్థీకృత పాల సేకరణ పెరుగుతుందని అంచనా వేశారు.

minister seediri appalaraju about milk procurement in state
సీదీరి అప్పలరాజు, మంత్రి
author img

By

Published : Aug 20, 2020, 3:55 PM IST

క్షీర విప్లవానికి ముందడుగు వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం రాష్ట్రంలోని మహిళలకు, పాడి రైతులకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాల సేకరణ 20 శాతం మాత్రమే వ్యవస్థీకృతంగా ఉందని మిగతా 80 శాతం మేర ప్రైవేటుగా అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అమూల్​తో ఒప్పందం ద్వారా వ్యవస్థీకృత పాల సేకరణ పెరుగుతుందని అంచనా వేశారు. చేయూత పథకంలో భాగంగా లబ్ధిదారులకు పాడి పశువులను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. సెర్ప్, మెప్మాల ద్వారా 2, 4 యూనిట్లుగా వాటిని మహిళలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు వివరించారు.

ఇవీ చదవండి..

వరద నీటితో నిండుకుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.