రాష్ట్ర ప్రజలకు రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పేర్ని నానికి తన కార్యాలయంలో గిలకలదిండికి చెందిన విశ్వనాథపల్లి పైడమ్మ వీరబాబు, పీతా దుర్గా, హోంగార్డు దుర్గా తదితరులు రాఖీ కట్టారు.
దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ఏకైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని మంత్రి కొనియాడారు. వైకాపా ప్రభుత్వం సమాజంలో మహిళలకు ఉన్నతస్థానం కల్పిస్తోందన్నారు. తన కార్యాలయం వద్దకు వచ్చిన పలు ప్రాంతాల ప్రజలతో మంత్రి మాట్లాడారు. తమ సమస్యలను వారు మంత్రికి విన్నవించారు. వారి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందిని మంత్రి హామీ ఇచ్చారు.
అమ్మలోని "అ", నాన్నలోని "న్న" కలిస్తే అన్న అని...అమ్మ కురిపించే ఆప్యాయత, నాన్న కల్పించే భద్రతల రెండింటిని అన్నయ్యలు తమ చెల్లెళ్లకు కల్పించాలి. ఆత్మీయబంధాలకు ప్రతిబింబంగా జరుపుకునే రాఖీ పండుగ... సోదర బంధానికి ప్రతీకగా నిలుస్తుంది.దూరమవుతున్న మానవ సంబంధాలను పెంచడానికి, అనుబంధాలను చాటే మంచి సంప్రదాయ పండుగ రాఖీ పౌర్ణమి.రాఖీ పండుగను ఏదో సరదాగా జరుపుకోకుండా విలువలతో, సంప్రదాయంతో, బాధ్యత, రక్షణగా సోదరులు దీనిని స్వీకరించి మహిళలందరికీ అండగా ఉండాలి. ఆత్మీయతను పంచే రాఖీ పండుగ అంటే నాకెంతో ఇష్టం .-పేర్ని నాని, మంత్రి
ఇదీ చదవండి