విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కొవిడ్-19పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని....అధికారులు చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో పది పడకలతో క్వారంటైన్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి....లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
'కృష్ణాలోనే అత్యధిక కరోనా నిర్ధరణ పరీక్షలు' - కృష్ణా జిల్లాలో కరోనా ఎఫెక్ట్ న్యూస్
రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణాజిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కరోనా విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.