భవన నిర్మాణ కార్మికులు ఏ కారణంతో మృతి చెందినా.. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షం దాన్ని ఇసుక ఖాతాలో వేస్తోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తోందని.. అందుకే ఇసుక తవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కటాఫ్ మార్కులు తగ్గించే అంశంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి:
'కిసాన్ క్రెడిట్ కార్డు రుణాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'