ETV Bharat / city

KTR : "తెలంగాణ ఇప్పుడో బ్రాండ్.. ఎనిమిదేళ్లలోనే పాతికేళ్ల ప్రగతి.." - ktr latest news

KTR Special Interview: నూతన తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం అద్వితీయంగా, ఆదర్శంగా సాగుతోందన్నారు ఆ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కేటీఆర్. బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా పయనిస్తున్నామన్న ఆయన.. రాష్ట్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఫలవంతులమయ్యామని చెప్పారు. కొన్ని హామీల అమలుకు సంబంధించి కొంత అసంతృప్తి ఉందన్న కేటీఆర్.. వాటి అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని... రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా పదేపదే బురదజల్లుతోందని ఆక్షేపించారు. దిల్లీ వేడుకల్లో పాల్గొనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా... విభజనచట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కేటీఆర్​తో "ఈటీవీ భారత్"​ ప్రత్యేక ముఖాముఖి.

KTR Special Interview
బ్రాండ్‌గా తెలంగాణ.. పాతికేళ్ల ప్రగతి ఎనిమిదేళ్లలోనే
author img

By

Published : Jun 2, 2022, 7:55 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి

తెలంగాణలో పెట్టుబడులపై అంతర్జాతీయ కంపెనీలు, యాజమాన్యాలు ఎలాంటి భావనతో ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్​ గురించి తెలుసు.. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి అంతగా తెలియదు. కాబట్టి 2014, 2015లలో మేము చేసిన పర్యటనలన్నీ తెలంగాణ అనే కొత్త రాష్ట్రం గురించి, రాష్ట్రం విధానాల గురించి.. ముఖ్యంగా ఐటీ విధానం, పారిశ్రామిక విధానంతో పాటు అనేక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పారిశ్రామిక వేత్తల కోసం 'స్వీయ ధ్రువీకరణ'.. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. 15 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 16వ రోజు లీగల్​గా వెళ్లొచ్చనే విధానాలు ఎక్కడ కూడా లేవు. విప్లవాత్మక విధానాలు ఏవైతే తీసుకొచ్చామో.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బాగా వాడుకున్నాం. ఇటీవల దావోస్​, యూకే పర్యటనల్లో తెలంగాణ అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాం. గత 8 ఏళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతిలిచ్చిన రాష్ట్రంగా... వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. పలు దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి తెలంగాణ చేరుకుంది. మన విజయాలను వరల్డ్​ ఎకనామిక్​ ఫోరంలో కూడా ప్రస్తావించాం. వారు మన విజయాలను చూసి అబ్బురపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు.. ప్రస్తుతం మూడింతలు వృద్ధి సాధించి రూ. లక్షా 83 వేల కోట్లకు చేరుకుంది.

హైదరాబాద్​ అంటేనే ఐటీ, ఫార్మా, లైఫ్​ సైన్సెస్​ రంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్​లో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు అమలు చేయబోతోంది?
ఐటీ రంగంలో కేవలం పెద్ద కంపెనీలను మాత్రమే ఆకర్షించడం కాకుండా కొత్త రకమైన ఆవిష్కరణలు, అంకురాలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టీ-హబ్​, వీ-హబ్​, టీఎస్​ఐసీ లాంటి కొత్త కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం. తెలంగాణ వచ్చే నాటికి 400 స్టార్టప్స్​ ఉంటే.. ఇప్పుడు 2వేల పైచిలుకు స్టార్టప్స్​ హైదరాబాద్​లో ఉన్నాయి. మా ఆలోచన, ఆశయం ఇంకా పెద్దగా ఉంది. అదేంటంటే.. 10వేల పైచిలుకు స్టార్టప్​లకు హైదరాబాద్​ కేంద్రం కావాలి. ఇక్కడి నుంచి యూనికాన్స్​ రావాలి. ఇక్కడి నుంచి లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించే సంస్థలు రావాలనేది ఒక ఆశయం. దానికనుగుణంగా ఈ టీ-హబ్​, వీ-హబ్ పెట్టినా.. ఆ క్రమంలో ఈకోసిస్టమ్​ నిర్మాణానికి దోహదపడుతున్నాయి. భారతదేశ వృద్ధి రేటు చూస్తే పోయిన సంవత్సరం సగటున 17 శాతం.. కానీ తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతం. దేశంలో ఏడాదిలో నాలుగున్నర లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే.. లక్షన్నర ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే.. అంటే మూడో వంతు ఇక్కడి వారే ఉద్యోగాలు సాధించారు. లైఫ్​ సైన్సెస్​ చూస్తే ప్రపంచానికి అందించే వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్​లో తయారవుతున్నాయి అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం 9 బిలియన్​ డోసులు తయారు చేస్తున్నాం. దానిని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఐటీ, లైఫ్​ సైన్సెస్​ మాత్రమే కాదు.. ఏరో స్పేస్​, ఏవియేషన్​లో రాబోతున్న అవకాశాలను కూడా అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఫుడ్​ ప్రాసెసింగ్​, టెక్స్​టైల్స్​, ఎలక్ట్రానిక్స్​, ఇతర అన్ని రంగాలకు సంబంధించి కూడా మంచి విధానాలను అవలంభిస్తున్నాం.

ఫార్మాసిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభం ఉంటుంది, కేటాయింపులు ఎప్పుడు జరగనున్నాయి?
అతి త్వరలో ఉంటుంది. ఇప్పటికే ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ 95 శాతం పూర్తయింది. కొన్ని కోర్టు వ్యాజ్యాలు అవీ ఇవీ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ చేతులమీదుగా ప్రారంభిస్తాం. ఫార్మాసిటీ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత గలిగిన ప్రాజెక్టుగా రూపాంతరం చెందబోతోంది. కొవిడ్​ వల్ల తెలంగాణ శక్తి సామర్థ్యాలు ఏమిటని ప్రపంచం మొత్తం తెలిసింది. కాబట్టి మనం ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్​గా ఏర్పడబోతోంది. ప్రపంచంలోని పెట్టుబడుదారులందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాలుష్యం అనేదే లేకుండా ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో దీనిని రూపొందిస్తాం. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజాప్రతినిధులు అపోహలు వదిలి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు అవుతోంది. మీరు కూడా తెలంగాణ కోసం కోసం కలలు కన్నారు. ప్రస్తుతం బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నాం. ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది?
నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాల ప్రాతిపదకనే కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కావాలి. స్వయం పాలనతో కూడిన తెలంగాణ తప్పకుండా బంగారు తెలంగాణ అవుతుందనే లక్ష్యంతో ముందుకు పోయాం. నీటి రంగంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని అద్వితీయ విజయాలను సాధించింది తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం రూపంలో కట్టినా, ఇంటింటికి మిషన్​ భగీరథ రూపంలో ఇచ్చినా, మిషన్​ కాకతీయ పథకంలో 20 వేల పైచిలుకు చెరువులను బాగుచేసినా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్వితీయ విజయాలు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించని ఘనమైన విజయాలు కేసీఆర్​ నాయకత్వంలో సాధించాం. నీటి విషయంలో కొంత అసంతృప్తి ఎక్కడంటే.. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి పంపకాలపై అసంతృప్తి ఉంది. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 811టీఎంసీల వాటా ఉండేది. అందులో మనం మొదటి నుంచి చేస్తున్న వాదన ఏమటంటే.. మహబూబ్​నగర్​, నల్గొండ, హైదరాబాద్​, రంగారెడ్డి ప్రాంతాల కోసం కృష్ణాబేసిన్​లో 575 టీఎంసీలు కావాలని.. సెక్షన్​ 3 ప్రకారం ట్రిబ్యునల్​కు సూచించాలని .. కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతున్నాం. వాళ్లు పెడచెవిన పెట్టడం.. పంపకాలు చేయాల్సిన వారు చేయకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయంలో అటువైపు ఏపీకి కూడా కొంత అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో ఎవరినైనా అనాల్సి వస్తే.. కేవలం కేంద్రం నిర్లిప్తత వల్లే ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. అది కూడా పూర్తయి ఉంటే నీటి విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చేవి. అయినప్పటికే వ్యవసాయం విషయంలో సంతృప్తి ఉంది. తెలంగాణ ఎంత పంట పండిస్తోందంటే కేంద్ర ప్రభుత్వమే మేం ఈ ధాన్యాన్ని కొనలేం అనే స్థాయిలో ఉంది.

నిధుల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్​తో ఉన్న రాష్ట్రం. ఆంధ్రతో కలిసి ఉన్నప్పుడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రమే. 1969లో ఉద్యమం జరుగుతున్నపుడు కూడా మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రమే. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అంతే. మిగులు బడ్జెట్​తో ఉన్న ఈ రాష్ట్రం.. ఇవాళ రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రకారం భారతదేశంలోనే నాలుగవ ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ రాష్ట్రం చేరుకుంది. పురోగతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

నియామకాల విషయానికొస్తే ప్రైవేటు రంగంలో.. ఒక ఐటీ రంగంలోనే గత ఎనిమిదేళ్లలో ప్రత్యక్షంగా కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు.. ఇతర రంగాలు చూస్తే దాదాపు 17లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగినం. మొత్తంగా చూస్తే దాదాపు 20 లక్షల పైచిలుకు ఉద్యోగాలు పరిశ్రమలు, ఐటీ రంగంలో సృష్టించగలిగాం. అదే విధంగా ప్రభుత్వం రంగంలో లక్షా 32 వేల ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేశాం. మరొక 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మొత్తంగా ఏ శీర్షికన తెలంగాణ ఉద్యమం సాగిందో.. అన్నింట్లోనూ అద్భుత విజయాలు సాధించాం. బంగారు తెలంగాణ వైపు మన ప్రస్థానం కొనసాగుతోంది.

70 ఏళ్ల నుంచి ఏం చేశారు..

ఈ 8 ఏళ్లలో ఆ వర్గానికి ఇది చేయలేదు.. అది చేస్తే బాగుంటుందని ఏమైనా అనిపించిందా?
అట్లా అని ఏం లేదు. తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న దశలో సమ్మెట పోటు లాంటి దెబ్బ పెద్ద నోట్ల రద్దు. ఆనాడు వారు మాకేదో చెప్తే మేం సమర్థించాం. కానీ దాని వల్ల ఏం ఉపయోగం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పాటు కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. కొవిడ్​ కంటే కూడా కేంద్రం అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాలు కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం చూపెడుతున్న సవతి తల్లి ప్రేమ చాలా గర్హనీయం, దుర్మార్గం, అరాచకం. ఇతర ప్రభుత్వాలు 25 ఏళ్లలో చేసే పనిని 8 ఏళ్లలో చేశామని గర్వంగా చెప్పొచ్చు.

2019 ఎన్నికలపుడు ఇచ్చిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి లేదంటారా?
కచ్చితంగా కొంత ఉంది. కొత్తగా 57 ఏళ్లు ఉన్నవారికి ఆసరా పింఛన్లు ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ భృతి, ఇళ్ల విషయం చెప్పాం. ఇంటి స్థలం ఉన్న వారికి రుణాలు ఇస్తామని చెప్పాం. రుణమాఫీ గురించి చెప్పాలి. ఇప్పటికే రెండు దశల్లో రూ.22 వేల కోట్లు వెచ్చించాం. ఇప్పటివరకు రూ.50 వేలలోపు రుణాలను మాఫీ చేశాం. మిగతా వాటిని కూడా మాపీ చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది. ఈ కొవిడ్​ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చినట్లు కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్​లు అప్పడే తెరాసపై దాడిని పెంచాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కూడా మాదే అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
రాహుల్​గాంధీ వరంగల్​లో మాట్లాడితే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. ఒక్క ఛాన్స్​ ఇవ్వాలని అంటున్నారు. 70 ఏళ్ల నుంచి ఏం చేశారు. మేం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అని భాజపా నేతలు అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా.. వాళ్లు అధికారంలో లేరా? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది ఎవరు.. భాజపా ప్రభుత్వం కాదా? దేశమంతా ఇవ్వండి.. మేము వద్దంటున్నామా? ఒక కులపిచ్చి, ఒక మతపిచ్చి పార్టీ తెలంగాణలో పాగా వేస్తాయనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్​ను వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై మీరు ఏం చెప్తారు?
ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చేందేమీ లేదు. తెలంగాణకు ఆయన ఇచ్చిన దాని కన్నా.. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిందే ఎక్కువ. ఇస్తామని చెప్పిన విద్యాలయాలు, పరిశ్రమలు ఇచ్చారా? కుటుంబపాలన అంటున్నారు.. ఎవరిది కుటుంబపాలన. భాజపాలో కూడా చాలా మంది ఉన్నారు. మోదీ గారి బాధ ఏందంటే.. ఆయనకు చెప్పుకోవడానికి ఏం లేదు. అవినీతి ప్రభుత్వం అని కేంద్రంలో ఉన్నవారు మాట్లాడితే.. ఎక్కడో జరిగిందో చెప్పాలి. కర్ణాటకలో భాజపా ఎమ్మెల్యే స్వయంగా చెప్పారు. కర్ణాటకలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పారు. ఎవరు అవినీతి పరులో ప్రజలకు తెలుసు.

అప్పుడు అవసరం లేని సీఎం ఇప్పుడెందుకు ..

ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రం అప్పులకు అనుమతి ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోయే పరిస్థితి ఉందా?
2014లో భారత ప్రభుత్వం అప్పు రూ.56 లక్షల కోట్లు. 2023 మార్చిన నాటికి భారత ప్రభుత్వ అప్పు రూ.156 లక్షల కోట్లకు చేరుతా ఉంది. 8 ఏళ్లలో కోటి లక్షల కోట్లు అప్పు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర ప్రభుత్వం అప్పులను నియంత్రించడానికి ఎఫ్​ఆర్​బీఎం అనే చట్టం ఉంది. ఎఫ్​ఆర్​బీఎం చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘించిందని ఎవరైనా రుజువు చేయగలరా? ఆ చట్టానికి లోబడే ప్రభుత్వం అప్పులు చేసింది. చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చేపట్టాం. రూపాయి అప్పుతో రూపాయిన్నర సంపదను సృష్టించాలి మళ్లీ రూపాయి పెట్టుబడి దిశగా సాగాలనేది మా ఉద్దేశం.

వరుసగా రెండు సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానికి సీఎం ఉద్దేశపూర్వకంగానే స్వాగతం పలకలేదనే విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు?
ఉత్త చేతులతో వస్తాం. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తామంటే.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కారణాలు ఏమైనప్పటికీ.. వారే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలప్పుడు ప్రధాని మోదీ భారత్​ బయోటెక్​ సందర్శనకు వచ్చారు. అప్పుడు పీఎం కార్యాలయం ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ఉత్తరం రాసింది. మరి అప్పుడు అవసరం లేని సీఎం ఇప్పుడెందుకు అని ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు ప్రధాని 8 సార్లు వచ్చారు.. కానీ 8 పైసలు తెచ్చారా? మా రాష్ట్రానికి ఏమి ఇవ్వని ప్రధానమంత్రికి ఎందుకు గౌరవం ఇవ్వాలి. ఆయన గుజరాత్​కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారు.

బెంగళూరు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒక ప్రకటన చేశారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఒక సంచలనం ఉంటుందని.. తెరాస జాతీయ పార్టీ కాబోతోందా?
తినబోతూ రుచులు అడగొద్దు. ఈ విషయంపై ముఖ్యమంత్రే సమాధానం చెబుతారు.

రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చారు. ఈ సారి తెలంగాణ రాష్ట్ర వైఖరి ఎలా ఉండబోతోంది?
ఎన్నికలను ప్రకటించనివ్వండి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​ అనేక మంది నాయకులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ కోసం భాజపా చేసింది గుండుసున్న. వారికి మాత్రం మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుందని ఈ రోజు చెప్పలేను కానీ.. వారి వల్ల తెలంగాణకు సున్న అయినపుడు.. వారి వల్ల రాష్ట్రానికి జరిగిందేమీ లేదు.

షెడ్యూల్​ ప్రకారం మరో ఏడాదిన్నరలో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ అంచనాలు ఎలా ఉన్నాయి. కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
మేము ప్రజలను నమ్ముకోని వెళ్లేవాళ్లం. మాకు వారిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. 75 ఏళ్ల భారత చరిత్రలో ఏం రాష్ట్రం సాధించని పురోగతిని తెలంగాణ సాధించింది. అది ప్రజల ముందు పెడతాం. భాజపా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో బేరీజు వేసుకోమని చెప్తాం. ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. మళ్లీ కేసీఆర్​ నాయకత్వాన్ని ప్రజలు దీవిస్తారనే విశ్వాసం ఉంది.

కేంద్రం వైఖరి కారణంగా జలాల విషయంలో రాష్ట్రంతో పాటు ఏపీ కూడా నష్టపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వంతో మీ సంబంధాలు ఎలా కొనసాగుతాయి?. ఇటీవల దావోస్​లో జగన్మోహన్​ రెడ్డి గారిని కూడా కలిశారు.
జగన్మోహన్​ రెడ్డి ప్రభుత్వంతో మాకు చక్కని సంబంధాలు ఉన్నాయి. పంచాయితీ ఏమీ లేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చు కానీ ఇతర విషయాల్లో సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. కేంద్రం ఉదాసీన వైఖరి వల్లే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వారు నాకు పెద్దన్న లాంటి వారు. ముఖ్యమంత్రి గారికి కూడా వారితో మంచి సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకు ఎలాంటి తగాదాలు లేవు. చుట్టు పక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సత్సంబంధాలనే కోరుకుంటాం.

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయి?
కచ్చితంగా పురోగతి సాధించినం. మంచినీటి సరఫరా, విద్యుత్​ సరఫరా గణనీయంగా పెరిగింది. నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. నగరంలో ఫ్లైఓవర్లు, లింక్​రోడ్లు, రహదారుల నిర్మాణాలు చేపట్టాం. ఎస్​ఎన్డీపీలో భాగంగా హైదరాబాద్​లోని మురికినీటి వ్యవస్థను కూడా ఆధునికీకరిస్తున్నాం. అది నిరంతరం జరగాల్సి ఉంది. జరుగుతోంది కూడా. దక్షిణ భారత్​లోనే చెత్త నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్లాంట్​ను (20 మెగావాట్లు) ఏర్పాటు చేశాం. మరొక 20 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణంలో ఉంది. ఒక విశ్వనగరానికి కావాల్సి అన్ని హంగులు ఏర్పాటు చేసే దిశగా ముందుకు పోతున్నాం.

దావోస్​ పర్యటనలో ఒక పారిశ్రామిక వేత్త 20 ఏళ్లలో ప్రధాని అవుతారు అని అన్నారు. దానిపై మీరేమంటారు?
ప్రజలు అవకాశం ఇస్తే మంత్రిని అయ్యాను. సిరిసిల్ల ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా, కేసీఆర్​ అవకాశమిస్తే మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నాను. మరోసారి అవకాశం ఉంటే తెలంగాణ ప్రజలకే సేవ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అంత పెద్ద ఆశలు లేవు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.