వైకాపా కార్యకర్తల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ స్పష్టం చేశారు. ప్రేరేపిత ఉగ్రవాదులు మాదిరి వైకాపా కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని వైకాపా ఎమ్మెల్యే రక్షణ నిధిని ప్రశ్నించారు. వైకాపా కార్యకర్తలు క్రమశిక్షణతో నడుచుకునేలా రక్షణ నిధి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు. వైకాపా అధినేత జగన్ కి క్రమశిక్షణ లేదని.. అలాంటిది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామనే భయంతో తెదేపా కార్యకర్తలపై దాడులకు దిగితే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జవహర్ హెచ్చరించారు.
ఇవి చదవండి....