విజయవాడలో పై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి.. సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లితో కలిసి ఆయన పరిశీలిచారు.
రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే ఆలయాలపై దాడులు చేస్తున్నట్లుందని పురపాలక శాఖ మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదంపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు విధ్వేషాలు రెచ్చగొట్టడం కాదా ?: తెదేపా