ETV Bharat / city

BOTSA : 'న్యాయస్థానం ఆదేశాలతో రాజధాని విశాఖకు తరలిస్తాం' - minister botsa satyanarayana latest updates

రాజధానిపై రోజువారీ విచారణ చేస్తామని హైకోర్టే చెప్పిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కేసు వేసిన పిటిషినర్లు ఎందుకు వాయిదా అడిగారో తెలియట్లేదన్న ఆయన... వాయిదా వేయాలని ఆడగటంలో ఏమైనా దురుద్ధేశం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Aug 23, 2021, 4:19 PM IST

Updated : Aug 24, 2021, 4:28 AM IST

పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లేఅవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రి ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్‌ 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. సమీక్ష అనంతరం పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలు వెల్లడించారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు వాటర్‌ ప్లస్‌ సిటీలుగా ధ్రువీకరణ లభించిందని, ఇదే స్ఫూర్తితో మిగిలిన కార్పొరేషన్లలోనూ ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

‘‘రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పింది. విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదు. రాజధానిపై కేసు వేసిన పిటిషనర్లకు వాయిదా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది. వాయిదా వేయాలని అడగటంలో ఏమైనా దురుద్దేశం ఉందా... అనేది అర్థం కావడంలేదు. ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం... న్యాయస్థానం ఆదేశాలతోనే విశాఖ వెళ్తాం’’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం, నలుగురు పోలీసుల దుర్మరణం

Last Updated : Aug 24, 2021, 4:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.