Minister Balineni: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఐకాస నేతలతో చర్చిస్తున్నారు. గతనెల 28న.. 24 డిమాండ్లతో ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతున్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ.. ఉద్యోగులు నోటీసుల్లో పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటుచేసిన పీఆర్సీ.. ఆమోదయోగ్యం కాదన్నారు. పీఆర్సీ బాధ్యతను విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని.. ఉద్యోగులు, కుటుంబాలకు అపరిమిత వైద్యసౌకర్యం సహా.. విద్యుత్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటిపై.. ఉద్యోగ సంఘాల నేతలతో బాలినేని చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: